ఆదివారం (28. 10. 18) న రాజమహేంద్రవరం లో గోదావరి రచయితల సంఘం (గోరసం ) ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి శత వర్ధంతి సందర్భంగా నిర్వహించిన తెలుగు జాతీయ శతాధిక కవి సమ్మేళనం లో కృష్ణా జిల్లా ,మారేడుమాక ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి రాజేంద్ర ప్రసాద్ కు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో తెలుగు రక్షణ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కత్తిమండ ప్రతాప్ ,తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షలు శ్రీ కళారత్న పొట్లూరి హరికృష్ణ మరియు ఇతర ప్రముఖులు చేతులమీదుగా పురస్కారంతో పాటు ఘన సత్కారం చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన గోరంసం సంఘం అధ్యక్షులు శ్రీ సత్య రాజేష్ మరియు వారి కార్య నిర్వాహక వర్గానికి అభినందనలు తెలియచేస్తూ ,తనకు ఇక్కడ రాజమహేంద్రవరం లో ఇది రెండవ పురస్కారం అని హర్షాన్ని వ్యక్త పరిచారు . గతంలో వారికి 2015 లో శ్రీ శ్రీ కళావేదిక తరఫునుంచి ''సాహితీ రత్న '' పురస్కారం రావడాన్ని ఈ సందర్భంగా చేసుకున్నారు
Monday, 29 October 2018
Saturday, 14 July 2018
పేరు : గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
కలం పేరు : గరిమెళ్ళ గమనాలు
స్వస్థలం : విజయవాడ
ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్
వృత్తి : మాదాపూర్ లో ఓ ప్రెవేట్ కంపెనీలో ఉద్యోగం
ప్రవృత్తి : కవితలు మరియు పాటలు
ఇప్పటిదాకా రాసిన కవితలు : సుమారుగా 500
ఇప్పటిదాకా రాసిన పాటలు : సుమారుగా 70
పొందిన బిరుదులు : సాహితీ రత్న , కవి ప్రపూర్ణ , సహస్ర కవి మిత్ర
Subscribe to:
Posts (Atom)