Thursday, 20 June 2024

నాన్నకు లేఖ

 నాన్న బాధ్యతలు అంటే ఇలా ఉంటాయా?

అందుకే త్వరగా నీ దారి నువ్వు చూసుకున్నావా నాన్న


నువ్వుంటే నా జీవితం ఎలా ఉండేదో తెలియదు కాని

నువ్వు లేని జీవితం ఎందుకో ఒంటరి అనిపిస్తుంది


ఇంకా అర్ధ జీవితానికి కూడా చేరుకోలేదు నాన్న

నా పిల్లలు ఇంకా బాల్యం వయస్సులోనే ఉన్నారు

నేను ఏమిట్రా అంటే ఇలా భయపడుతూ చస్తున్నాను

టెన్షన్ పడుతూ నా బుర్ర నేను చెడగొట్టుకుంటున్నాను


హాయిగా ఉంటాను అనే భ్రమ కాసేపు

రేపు ఏమవుతుందో అని భయం మరి కాసేపు

భయం అంతగా ఎరుగను నాన్న ఒకప్పుడు 

ఇప్పుడు భయం నే నా ఆయుధంగా వాడుకోవాల్సివస్తుంది


నాన్న అంటే తన భుజాలపైన ఆడించి పాడించేవాడంటారు

నా పిల్లల జీవితాలు చూడగలిగే వరకు ఉంటే చాలు నాన్న

అది కూడా కుదరదు అంటే 

నా కుటుంభాన్ని స్ట్రాంగ్ చేసేవరకు అన్నా చాలు

నేను ఇప్పుడు ఒక మానసిక రోగిని

ఎవ్వరికీ ,ఏమీ చెప్పుకోలేని రోగిని

నా రోగం ఎవరికన్నా తెలిసినా 

విస్తుపోతారేమో కాని ,ఏమీ చెయ్యలేరు


నన్ను సంతోషం వచ్చి పలకరించేలోపే

బాధ వచ్చి విషం ఇచ్చి పోతూ ఉంటుంది నాన్న


నా రాత ఇలానే రాసి ఉందేమో

కాని నా బిడ్డల భవిష్యత్తు భాగుంటే చాలు నాన్న

మన వారసత్వం ,వంశం విరాజిల్లాలి నాన్న