Thursday, 20 June 2024

నాన్నకు లేఖ

 నాన్న బాధ్యతలు అంటే ఇలా ఉంటాయా?

అందుకే త్వరగా నీ దారి నువ్వు చూసుకున్నావా నాన్న


నువ్వుంటే నా జీవితం ఎలా ఉండేదో తెలియదు కాని

నువ్వు లేని జీవితం ఎందుకో ఒంటరి అనిపిస్తుంది


ఇంకా అర్ధ జీవితానికి కూడా చేరుకోలేదు నాన్న

నా పిల్లలు ఇంకా బాల్యం వయస్సులోనే ఉన్నారు

నేను ఏమిట్రా అంటే ఇలా భయపడుతూ చస్తున్నాను

టెన్షన్ పడుతూ నా బుర్ర నేను చెడగొట్టుకుంటున్నాను


హాయిగా ఉంటాను అనే భ్రమ కాసేపు

రేపు ఏమవుతుందో అని భయం మరి కాసేపు

భయం అంతగా ఎరుగను నాన్న ఒకప్పుడు 

ఇప్పుడు భయం నే నా ఆయుధంగా వాడుకోవాల్సివస్తుంది


నాన్న అంటే తన భుజాలపైన ఆడించి పాడించేవాడంటారు

నా పిల్లల జీవితాలు చూడగలిగే వరకు ఉంటే చాలు నాన్న

అది కూడా కుదరదు అంటే 

నా కుటుంభాన్ని స్ట్రాంగ్ చేసేవరకు అన్నా చాలు

నేను ఇప్పుడు ఒక మానసిక రోగిని

ఎవ్వరికీ ,ఏమీ చెప్పుకోలేని రోగిని

నా రోగం ఎవరికన్నా తెలిసినా 

విస్తుపోతారేమో కాని ,ఏమీ చెయ్యలేరు


నన్ను సంతోషం వచ్చి పలకరించేలోపే

బాధ వచ్చి విషం ఇచ్చి పోతూ ఉంటుంది నాన్న


నా రాత ఇలానే రాసి ఉందేమో

కాని నా బిడ్డల భవిష్యత్తు భాగుంటే చాలు నాన్న

మన వారసత్వం ,వంశం విరాజిల్లాలి నాన్న




Sunday, 19 May 2024

My health report

నమస్తే మేడం 
నా మెడిసన్స్ ఈరోజు తో కంప్లీట్ అయ్యాయి
రీసెంట్ గా పానిక్ అటాక్ వచ్చిన దగ్గర నుంచి
నాకు గతంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ
వాటినే తలచుకుంటూ , భవిషత్తు గురించి ఆందోళన చెందుతూ ఉండటం వలన నాకు భయం కల్గుతుంది .
మీరు ఇచ్చిన మెడిసన్స్ క్రమం తప్పకుండా వాడుతున్నాను కాకపోతే డే లో వేసుకోవాల్సిన మెడిసన్స్ అప్పుడప్పుడు మిస్ అవుతున్నాయి. నాకు అనిపిస్తుంది నాకు మందులు కన్నా నాలో ఆత్మ స్థైర్యం , నాపై నాకు నమ్మకం కలిగేలా నా మెదడుకు సిగ్నల్స్ అందితే నేను నార్మల్ కాగలనని ఇది కేవలం నా భావన మాత్రమే. 
ఇంకా నాలో దాగి ఉన్న భయాలు మీ ముందుకు తెస్తున్నాను

1) లిఫ్ట్ లో వెళ్ళాలంటే భయం 
2) కారు డ్రైవ్ చెయ్యాలంటే భయం
3) ఎత్తైన ప్రదేశాలలోకి వెళ్ళాలంటే భయం అది బిల్డింగ్స్ కావచ్చు, ఫ్లై ఓవర్స్ కావచ్చు
4) మొన్న రీసెంట్ గా పానిక్ అటాక్ అవ్వనంత వరకు
సింగిల్ గా జర్నీ చెయ్యగలిగే వాడిని, ఉండగలిగే వాడిని 
జర్నీ చేసే ముందు కొంచెం భయం అనిపించినా అది ఫేస్ చేస్తే మాత్రం ఏ ఆందోళన ఉండదు కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ భయం అనిపిస్తుంది 
5) నేను ఇంట్లో లేదా ఆఫీస్ లో ఉన్నప్పుడు నాకు ఆకస్మికంగా ఏదో జరిగిపోతుంది అని ఆలోచన వచ్చినప్పుడు నా బ్రెయిన్ కొంచెం ఒత్తిడి కి గురి అయ్యి వేడి ఎక్కువయ్యినట్టు ,చెవులు కూడా ఒక ఇరిటేషన్ లాగా ఫీల్ అయ్యి లైట్ గా కాళ్లు , చేతులు చెమటలు పట్టి, వణుకు ఉంటుంది 


Good Evening mam,

This is Rajendra Prasad. I finished my medication on yesterday. Since the recent panic attack remembering past events thinking about them and worrying about the future makes me scared.

I am using the medicines given by you regularly if not, the medicines to be worn during the day are sometimes missed. It's just my feeling that if I get the signals to my brain to make me believe in myself, I'll be normal.

I am bringing to you the fears that are still hidden in me

Ø  Afraid to go in the lift

Ø  Fear of driving a car

Ø  Fear of going to high places be it buildings or fly overs

Ø   I was able to travel alone & stay alone before the panic attacks recently

Before the journey I felt a little fear but if I face it there is no worry but now I feel a little more fear

Ø  When I am at home or in the office when I think that something will suddenly happen to me, my brain feels a little stressed and hot, the ears also feel like an irritation, light-headedness, sweaty legs and hands, and trembling.


Monday, 11 April 2022

నా మాట - ఒక స్వప్నం కోసం (ఫైనల్)

అందరికీ నమస్కారం!
నా పేరు గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్."గరిమెళ్ళ గమనాలు" అను నా కలం పేరుతో మీ అందరికీ సుపరిచయమే అని భావిస్తున్నాను.

ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక నా స్వప్నం నేడు నా "కవితా సంపుటి" రూపంలో ఆవిష్కారం అవుతుంది.ఇది నా మొదటి కవితా సంపుటి పేరు "ఒక స్వప్నం కోసం" చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కనే ఉంటాం. అవి కొందరు నిజం చేసుకుంటారు. ఇంకొందరు నిజం అయితే బాగుండు అని ఆలోచన చేస్తూ ఉంటారు.ఇది నా సాహితీ ప్రస్థానంలో నేను వేసే ముందు అడుగు ఈ పుస్తకం. ఈ సాహిత్య ప్రపంచంలో ఒక చిన్న మైలు రాయిని నేను. పరిస్థితులను గమనిస్తూ , జీవితాన్ని అన్వేషిస్తూ ,సమాజాన్ని ప్రశ్నిస్తూ, ఒక మంచి మార్పుకై ఎదురుచూస్తూ రాస్తున్న , రాసుకున్న నా కవితల లో నుంచి కొన్నింటిని పుస్తక రూపంలో సాక్ష్యంగా నా వంతు నేను చేస్తున్న ప్రయత్నం ఈ "ఒక స్వప్నం కోసం"


నా పరిచయానికి వస్టే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లో కేసరపల్లి అను గ్రామం నా స్వస్థలం . వృత్తి రీత్యా హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాలుగా సెటిల్ అయ్యాను.. మా నాన్న గారి పేరు కీ. శే . సాంబశివరావు . అమ్మ పేరు పద్మావతి. నాన్న పిన్న వయసులోనే కాలం చేయటం వలన అమ్మ ప్రేమతో గారాబంగా పెరిగాను. అమ్మ చేపట్టిన బాధ్యతలో నేను కూడా ఒక క్రమశిక్షణ తోనే , మా అమ్మమ్మ గారింట్లో మేన మామ గారైన "దేవళ శ్రీనివాసరావు" ఆధ్వర్యంలో విద్యాభ్యాసం కంప్లీట్ చేశాను. అమ్మంటే బాధ్యతగా , అమ్మనే దేవతగా భావించి , అమ్మ చెప్పిన మాటతో నా జీవితానికి బాట వేసుకుని, "పద్మ" ను వివాహం చేసుకుని నా కూతురు గారాల పట్టీ "లేక్షణ" తో సంతోషంగా ,విజయవంతం గానే జీవిస్తున్నా అని చెప్పవచ్చు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పరిజ్ఞానం కొంచెం ఉండటం చేత నాకు తోచినట్టుగా తెలియని వాటి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస తో తెలుసుకుంటూ నన్ను నేను చదువుకుంటూ ఎదిగాను.నా బాల్యంలో కవి అంటే తెలియని వారిని చూసాను. అస్సలు ఆ పథం అంటే ఏంటో పూర్తిగా అవగాహన లేని స్థానం నాది. నాకు నేను పాటల రూపంలో ,కథల రూపంలో రాసుకుంటూ పాడుకునే వాడిని, చెప్పుకునే వాడిని. కవి అంటే ఏంటో తెలియని స్థాయి నుంచి  నేడు కవులను కోకొల్లలు గా కూడా గలగటం ,వారిలో నేను కూడా ఒక కవిగా మారి నేడు నా కవితా సంపుటిని విడుదల చేసే స్థాయికి రావటం చాలా హర్షణీయం. 

బాల్యంలో తరచుగా చదువుకున్నది ,నేర్చుకున్నది "మాతృ దేవోభవ ,పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ ,కాబట్టి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లదండ్రులకు పాదాభివందనాల తో నమస్సులు .అలానే నాకు సకల విద్యా బుద్దులు నేర్పించి ,నేను జీవితంలో రాణించుటకు కారణమైన నా గురువులు శ్రీ నాదేండ్ల లక్ష్మణ్ రావు గారు మరియు శ్రీ తిరుపతి రెడ్డి గార్లకు నా హృదపూర్వక నమస్సులు తెలియ.చేసుకుంటున్నాను. నా బాల్యం నుంచి చదువుతో పాటు ,పుస్తక పఠనాలు ,పేపర్లో వచ్చే ఆర్టికల్స్ ని , ఆసక్తిగా చదివి ఫాలో అవుతూ నాలో కూడా రచించే శక్తి ఉందని తెలుసుకున్నాను. నేను 9th లో రాసిన మొట్టమొదటి కవిత "జన్మ భూమి" దానికి స్కూల్లో ప్రైజ్ కూడా వచ్చింది. నేను చిన్నతనంలో రాసిన కథలు "రాక్షస బల్లి" & "ఎగ్జిబిషన్ " అలా అలా ఇంటర్లో ,డిగ్రీలో కొన్ని కొన్ని కవితలు రాయటం ,వాటిని పదిల పరుచుకోవటం , స్నేహితులకు ,బంధువులకు చదివి వినిపించడం చేస్తూ ఉండే వాడిని. అయితే నేను ఎక్కువగా ఆసక్తి కనపర్చి ,కవిగా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం "ముఖ పుస్తకం" ద్వారానే. నేను ఫేస్ బుక్ లో నేను కవితలు రాయటానికి ,కవిగా గుర్తింపు తెచ్చుకోడానికి అవకాశం ఇచ్చిన "మన తెలుగు మన సంస్కృతి" గ్రూప్ ల అడ్మిన్స్ శ్రీ మీగడ త్రినాథ్ రావుగారు & శ్రీమతి మంజు యనమదల గారికి నా కృతజ్ఞతలు .అలానే "సాహితీ సేవ" గ్రూప్ అడ్మిన్స్ శ్రీ కంచర్ల సుబ్బానాయుడు గారు & శ్రీమతి వడ్డే సిరి గార్లకు నా కృతజ్ఞతలు .నేను రాసే పాటలను ప్రోత్సహిస్తూ నాకు లిరిక్ రైటర్ గా అవకాశం ఇచ్చిన "మ్యూజిక్ వరల్డ్" గ్రూప్ అడ్మిన్స్ రాజేష్ గారు ,శ్రీమతి అరుణ గారు , మారుతి కుమార్ గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.

సుజాత తిమ్మన గారు :-
సుజాత గారు నాకు ముఖ పుస్తకం అందించిన మంచి ఆత్మీయురాలు , శ్రేయోభిలాషి ,మాతృ సమానులు. నాకు ఈవిడ పరిచయం అయినాక నా జీవితంలో ,నా సాహితీ ప్రస్థానంలో అమ్మది ప్రముఖ పాత్ర అని చెప్పవచ్చు. తల్లిగా స్నేహితరాలిగా, సలహాలు సూచిస్తూ , మార్గనిర్దేశం చూపుతూ,నాలోని ప్రతిభని ప్రోత్సహిస్తూ ,నాకు ఒక ఇన్స్పిరేషన్ గా ,గైడ్ గా ఉండేవారు. నా పుస్తకానికి తొలిపలుకు లు అందించి మనస్పూర్తిగా ఆశీర్వదించి నందుకు ప్రేమతో నా నమస్సులు తెలియ చేసుకుంటున్నాను.

డా. కట్టిమండ ప్రతాప్ గారు :
నేను బాగా రాస్తున్నా నని ,నా కవితలు బాగుంటాయని ఇలానే కొనసాగాలని ప్రోత్సహించే వారు . పత్రికలకి పంపటం తెలియని నాకు నా కవితల్ని పత్రికలకు పంపి పబ్లిష్ చేయించారు .వారు నిర్వహించే కవి సమ్మేళనాలు లో, సభలలో నాకు ప్రత్యేక పాత్రను కనపరిచి ,బాధ్యతలు ఇచ్చి ముందుకు నడిపించే వారు .వీరు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కవి , ప్రభుత్వ గుఱ్ఱం జాషువా అవార్డ్ గ్రహీత ,సాహితీ భూషణ్ ,అక్షర తపస్వి .వీరి కలం నుండి పుట్టే ప్రతీ అక్షరం సమాజ చైతన్యాన్ని ,స్ఫూర్తిని కల్గిస్తుంది. సమాజ శ్రేయస్సుకై వీరి కలం ఎప్పుడూ మండే కత్తిలా పోరు కొనసాగిస్తూనే ఉంటుంది .నాకు వీరు సోదరా సమానులు , ఆత్మీయులు ,ఎప్పుడూ చిరునవ్వుతో ఆత్మీయంగా పలకరిస్తారు. నాలాంటి వారెందరో వర్ధమాన కవులకు మార్గ దర్శకులు .ప్రస్తుతం శ్రీ శ్రీ కలావేదిక ను స్థాపించి శాకోపశాఖలుగా విస్తరింప చేస్తూ కవులను/ కళాకారులను ముందుకు నడిపించే నేటి మేటి కవి రథసారథి ,కవి చక్రవర్తి శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డా. కత్తి మండ ప్రతాప్. నాకోసం నేడు వారి విలువైన సమయాన్ని వెచ్చించి నా కవితా సంపుటికి వారి మాటను జతకలిపి 
మరింత ఆనందాన్ని అందించిన వారికి అభిమానంతో కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.

పొట్లూరి హరికృష్ణ గారు 

అక్షరాన్ని ఆరాధిస్తూ 
వాక్యాన్ని విశ్లేషిస్తూ 
కావ్యాన్ని విశదీకరిస్తూ
కవిత్వాన్ని కీర్తిస్తూ 
సాహిత్యాన్ని శ్వాసిస్తూ
కవులను /కళాకారులను ప్రోత్సహిస్తూ 

తెలుగు జాతి ఔనత్యం కోసం ,తెలుగు జాతి అభివృద్ధి కోసం ,తెలుగు వెలుగులు అందరికీ పంచటం కోసం ,తెలుగు ఉనికిని కాపాడటం కోసం తన వంతు బాధ్యత గా ,ఉషోదయిస్తున్న సూర్యిడిలా , తెలుగు రక్షణ వేదికనుస్థాపించి ,ఎన్నో సాహితీ కార్యక్రమాలను నిర్వహించి ,ఎంతో మంది కవులకు చేయూత నిస్తూ,కొత్త కొత్త సమూహాలకు ,సంస్థలకు ఊపిరి పోస్తూ అందరికీ దారి చూపించిన భవనీయులు, అక్షర సేద్యం చేస్తున్న నిత్య కృషీ వలులు. అక్షర ప్రేమికులకు ,సాహితీ ఉపాసకులకు ఎప్పుడూ వెన్నంటి నేనున్నా అంటూ ముందుకు నడిపించే మార్గ దర్శకులు .ఎంత ఎదిగినా కించిత్ గర్వం కూడా చూపకుండా ప్రేమగా అందరికీ ఎదురెల్లి పలకరించే ఆప్తబందువు. నాకు సోదర సమానులు , ఆత్మీయులు, శ్రేయోభిలాషి, నాలాంటి వారి మరెందరికో హితాన్ని బోధించే గురువు. పిలిచినా పలికే తత్వం ,వీరితో నా పరిచయం నా సాహితీ ప్రస్థానంలో నూతన అధ్యాయానికి శ్రీకార మవుతుంది. ఈ కవితా సంపుటి మొత్తం తానే స్వయంగా సంపూర్ణ బాధ్యత తీసుకుని , రూపకల్పన కు ,సహకారం ఇచ్చి అమూల్యమైన వారి మాటలను ముందు మాట గా రాసి ,నన్ను ప్రోత్సహించి , ఆశీర్వదించి నందుకు ప్రేమతో హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేసు కుంటున్నాను.

Wednesday, 10 November 2021

నా మాట - ఒక స్వప్నం కోసం

అందరికీ నమస్కారములు!
నా పేరు గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ .. "గరిమెళ్ళ గమనాలు" అను నా కలం పేరుతో మీ అందరికీ సుపరిచయమే అని భావిస్తున్నాను. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక నా స్వప్నం నేడు నా కవితా సంపుటి రూపంలో ఆవిష్కారం అవుతుంది., మాది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా  జిల్లాలోని కేసరపల్లి అను గ్రామం నా స్వస్థలం .వృత్తి రీత్యా కొన్ని సంవత్సరాలుగా  హైదరాబాద్ లో సెటిల్ అయ్యినాను. మా నాన్న గారి పేరు కీ. శే. సాంబశివరావు గారు అమ్మ పేరు పద్మావతి .నాన్నగారు పిన్న వయస్సులోనే కాలం చేయటం వలన అమ్మ ప్రేమలో గారాబంగా పెరిగాను.అమ్మ చేపట్టిన బాధ్యతలో నేను కూడా ఒక క్రమశిక్షణ గానే ,నా మేనమామ "దేవళ్ళ శ్రీనివాసరావు" ఆధ్వర్యంలో నా విద్యాభ్యాసం కొనసాగించాను. చిన్నప్పటి నుంచి పుస్తక పరిజ్ఞానం కొంచెం ఉండటం చేత నాకు తోచినట్టు గా, తెలియని వాటి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస తో తెలుసుకుంటూ నన్ను నేను చదువుకుంటూ ఎదిగాను. నేను చిన్నప్పుడు కవి అంటే తెలియని వారిని చూసాను ,ఎగతాళి చేసిన వారిని చూసాను అసలు ఆ పదం అంటే ఏంటో పూర్తిగా అవగాహన లేని స్థానం నాది. నాకు నేను పాటల రూపంలో, కథల రూపంలో రాసుకుంటూ చెప్పుకుంటూ వచ్చేవాడిని.  కవి అంటే ఏంటో తెలియని స్థాయి నుంచి నేడు కవులును కోకొల్లలుగా చూడగలగడం వారిలో నేను ఒక   కవిగా మారి నేడు నా కవితా సంపుటి విడుచల చేసే స్థాయి కి రావటం చాలా సంతోషంగా ఉంది .చిన్నప్పుడు తరచుగా చదువుకున్నది "మాతృ దేవో భవ, పితృ దేవో భవ,ఆచార్య దేవో భవ, అతిధి దేవభవ"  కాబట్టి ముందుగా నాకు జన్మ అందించినందుకు మా తల్లి తండ్రులకు పాదాభివందనాల తో నమస్సులు అలానే నాకు సకల విద్యాబుద్దులు నేర్పించి నేను జీవితంలో రానించుటకు కృషి చేసిన నా గురువులు " శ్రీ నాదెండ్ల లక్ష్మణ్ రావు గారు" & శ్రీ తిరుపతి రెడ్డి గార్లకు " నా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటున్నాను.  
మాది ఒక సాధారణ రైతు కుటుంబం. మా  నా చిన్నతనంలోనే మా నాన్నగారిని కోల్పోయాను. మా అమ్మమ్మ గారింట్లో ,మా మేనమామ గారి ఆధ్వర్యంలో నా విద్యాభ్యాసం కంప్లీట్ చేసాను. అమ్మంటే బాధ్యతగా , అమ్మనే దేవతగా భావించి, అమ్మ చెప్పిన మాటతో నా జీవితానికి బాట వేసుకుని మంచి విజయవంతంగా నే జీవిస్తున్నా అని చెప్పవచ్చు. మా కుటుంబ నేపథ్యంలో ఎవరూ కవులు/కవయిత్రులు గాని లేరు.చిన్నప్పటి నుంచి చదువుతో పాటు, పుస్తక పఠనాలు, పేపర్లో వచ్చే ఆర్టికల్స్ ని ఇంట్రెస్ట గా చదివి ఫాలో అవుతూ ,నాలో కూడా రచించే శక్తి ఉందని తెలుసుకున్నాను. నా ప్రథమ కవిత "జన్మభూమి" నా తొమ్మిదో తరగతిలో వక్తృత్వ పోటీలు చదివి ఫస్ట్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాను.అలానే నేను రాసిన మొదటి కథలు "రాక్షసి బల్లి" & ఎగ్జిబిషన్" అలా అలా ఇంటర్లో ,డిగ్రీలో కొన్ని కొన్ని కవితలు రాయటం వాటిని పదిలపరుచుకోవటం, స్నేహితులకు ,బంధువులకు చదివి వినిపించడం చేస్తూ ఉండేవాడిని .అయితే నేను ఎక్కువగా ఆసక్తి చూపి ,కవిగా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం "ఫేస్ బుక్" ద్వారానే. నాకు ఫేస్ బుక్ లో కవిగా గుర్తింపు వచ్చిన ,కవితలు నా శైలిలో నేను రాయటానికి అవకాశం ఇచ్చిన "మన తెలుగు మన సంస్కృతి" గ్రూప్ మరియు "సాహితీ సేవ" గ్రూప్ ల అడ్మిన్స్ శ్రీ మీగడ త్రినాథ్ , శ్రీమతి మంజు యనమదల గారు, శ్రీ కంచర్ల సుబ్బారాయుడు గారు, శ్రీమత్సి వడ్డే సిరి గార్లకు వారికి నా కృతజ్ఞత లు తెలియ చేసుకుంటున్నాను.అలానే నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ, సమయానికి సలహాలు సూచనలను అందజేస్తూ ,వారు నిర్వహించే కవి సమ్మేళనాలు,సభల లో నాకు ముఖ్య పాత్రను కనబరిచి ,బాధ్యతలు ఇచ్చి నన్ను ముందుకు నడిపిన శ్రీ కత్తి మండ ప్రతాప్ గారు నేడు వారు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కవి మిత్రులు, కవి సార్వభౌములు నాకోసం నేడు వారి విలువైన సమయాన్ని వెచ్చించి నా కవితా సంపుటి వారి మాటను జతకలిపి మరింత ఆనందాన్ని అందించిన వారికి అభిమానంతో హృదయ పూర్వక కృతజ్ఞతలు తెియజేస్తున్నాను. ఈ కాల గమనంలో ఎవ్వరితో ,ఎప్పుడూ ఎలా బందం ముడిపడుతుందో ఎవరికీ తెలియదు నాకు కూడా అలానే అనుకోని అతిథిలా పరిచయం అయ్యి ,నేడు నాకు సాహిత్య ప్రకారంగా అండంగా, అన్నగా నిలబడి 

Wednesday, 12 June 2019

My Bio-data

పేరు  : రాజేంద్ర ప్రసాదు 
ఇంటిపేరు : గరిమెళ్ళ 
కలం పేరు : గరిమెళ్ళ గమనాలు 
facebook ID  : గరిమెళ్ళ గమనాలు 
అమ్మ పేరు : పద్మావతి 
నాన్న పేరు : కీ // శే // సాంబశివరావు 
భార్య పేరు : శ్రీ పద్మ 
పుట్టిన తేదీ : 01. 10. 1984
స్వస్థలం : కేసరపల్లి , కృష్ణా జిల్లా ,ఆంధ్ర ప్రదేశ్ 
ప్రస్థుత నివాసం : హైదరాబాద్ , తెలంగాణ 
Qualification : ఎంబీఏ  (ఫైనాన్స్)
ప్రవృత్తి  : కవితలు మరియి పాటలు రాయటం 
బ్లాగ్ పేరు : garimellagamanalu.blogspot.in 
mailed : rpgarimella009@ gmail.com 
Contact No :9705793187
అలవాట్లు : సామెతలు రాస్తూ ఉండటం ,వ్యక్తుల పేర్ల మీద కవితలు రాయటం 
పాటలు హమ్మింగ్ ...etc 
ఇప్పటిదాకా రచించిన కవితలు : సుమారుగా 400 
ఇప్పటిదాకా రాసిన కధలు : 1 (చిన్ననాటి స్నేహమా నీవెక్కడ) 
ఇప్పటిదాకా రచించిన పాటలు : 70

వివిధ పత్రికలలో ప్రచురించబడిన నా కవితలు : 26

(ఆంధ్రజ్యోతి ,గోదావరి సాహిత్యం ,గణేష్ & అల మరియు దినపత్రికలలో 
రేపటి కోసం మరియు స్వర్ణపుష్పం మాస పత్రికలలో 
మరియు ఇతర మన కవితలు .కామ్ ,కువైట్ ఏం ఆర్ ఐ ,అచ్చంగా తెలుగు ,విహంగా అంతర్జాల పత్రికలలో )

వివిధ కవితా సంపుటి లలో ప్రచురణ గావించబడిన నా కవితలు  : 6

1)సినారె (మేజిరసం వారి సంపాదకత్వంలో  వచ్చిన ''కవి విశ్వంభరుడు '' సంపుటిలో 
2)తెలంగాణ జల ధార (మేజిరసం వారి సంపాదకత్వంలో రాబోయే ''కాళేశ్వర వైభవం సంపుటిలో 
3)రమణీయం (తెలుగు బాషా చైతన్య సమితి వారి సంపాదకత్వంలో  వచ్చిన శ్రీ వెంకటేశ్వర వైభవం సంపుటిలో 
4)పిలిస్తే పలుకుతావట (పాలమూరు సాహితీ వారి సంపాదకత్వంలో వచ్చిన బాబా సన్నిధి అను సంపుటిలో
5)నా దేశం -సందేశం (స్వర్ణపుష్పం -శ్రీమతి మంగళ గారి సంపాదకత్వంలో వచ్చిన 
స్మరిద్దాం ఈ వేళ అను కవితా సంపుటిలో 
6) 'అన్నపూర్ణా -వందనం ' (గోరసం వారి సంపాదకత్వంలో - శ్రీమతి డొక్కా సీతమ్మ వారిపై రూపొందించిన సంపుటి లో ) 

పొందిన సత్కారాలు & పురస్కారాల వివరములు :

1) తెలుగు బాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వైభవం పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం లో జరిగిన సత్కారం (సంపుటి లో నా కవితకు స్థానం )-జూన్ '19

2) పాలమూరు సాహితీ వారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ షిరిడీ సాయి కవిసమ్మేళనంలో లభించిన సత్కారం (మే -2019)

3) తానా మరియు తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన మూడుతరాల సాహిత్య సమ్మేళనం లో అందుకున్న సత్కారం (డిసెంబర్ -2018)

4)గోరసం ఆధ్వర్యంలో  రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన శత కవి సమ్మేళనంలో అందుకున్న కందుకూరి పురస్కారం (అక్టోబర్ -18)

5) విజయవాడ లో ప్రతిలిపి వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో ''కవి ప్రవీణ '' బిరుదుతో సత్కారం  (అక్టోబర్ -17)

6) మేజిరసం వారి ఆధ్వర్యంలో కవి విశ్వంభరుడు పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఆ సంపుటి కోసం నేను కవిత పంపినందుకు ప్రశంసా పత్రంతో సత్కారం 

7) ఉభయ కళానిధి వారి ఆధ్వర్యంలో యాదాద్రి లో నిర్వహించిన యాదాద్రి శిల్ప కళా వైభవం పేరుతో జరిగిన కవి సమ్మేళనం లో పొందిన సత్కారం (జూలై -18)

8) ప్రపంచ కవితా దినోత్సవం సంధర్భంగా అస్తిత్వం వారి సంస్థచే అందుకున్న జాతీయ ప్రతిభా పురస్కారం (మార్చ్ -18)

9) అనంతపురంలో తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ,కళారత్న శ్రీ పొట్లూరి హరికృష్ణ గారి సారధ్యంలో జరిగిన ప్రపంచ తెలుగు కవి సంమ్మేళనంలో (33 గం . 44 ని . 55 సెకన్ల ) 
పొందిన సత్కారం 

10) శ్రీ స్వామి వివేకానందుని జన్మదినోత్సవం సందర్భంగా ఆలూరు లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ''యువత -భారతీయత '' అను కార్యక్రమంలో లభించిన యువ పురస్కారం 

11) వరంగల్ లో బిక్కి కృష్ణ గారు & ప్రభాకర్ జైనీ గారు నిర్వహించిన కవి సమ్మేళనంలో అందుకున్న సత్కారం  (మార్చ్ -17)

12) కాకినాడలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో జరిగిన రెండవ జాతీయ యువతరం తెలుగు సాహిత్య సమ్మేళనంలో అందుకున్న ప్రశంసా పత్రం & చిరు సత్కారం 

13) ప్రొద్దుటూరులో వేమన సాహితీ కళాపీఠం వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో పొందిన సత్కారం (జాన్వరీ -17)

14) రాజమండ్రిలో శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో కందుకూరి కళాశాల లో నిర్వహించిన కార్యక్రమంలో సాహితీ రత్న బిరుదుతో పొందిన ప్రతిభా పురస్కారం (అక్టోబర్ -16)

15) అంతర్వేదిలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవం లో జరిగిన కవి సమ్మేళనంలో అందుకున్న సత్కారం మరియు ప్రశంసా పత్రాలు (అక్టోబర్ -2016) 

(మరికొన్ని ఉన్నవి కానీ జ్ఞప్తికి రావటం లేదు )

పొందిన బిరుదులు :

సాహితీ రత్న - శ్రీ శ్రీ కళావేదిక నుంచి ,రాజమహేంద్రవరం 
కవి ప్రపూర్ణ  - ప్రతిలిపి అను అంతర్జాల సమూహం నుంచి 
(దీనిలో ఇప్పటిదాకా 280 రచనలు పొందుపరచబడినవి )
సహస్ర కవితా మిత్ర  - తెలుగు కవిత వైభవం అను వాట్స్ ఆప్ గ్రూప్ నుంచి 


వివిధ సాహితీ సంస్థలతో సమన్వయ కర్తగా చేసియున్న అనుభవం :

అంతర్వేదిలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవం లో   2015 & 2016 సంవత్సరం లో 
హైదరాబాద్ తరపున సమన్వయ కర్తగా చేసిన అనుభవం 

అలానే అంతర్వేదిలో జరిగిన  ''ప్రపంచ తెలుగు మహాసభలు '' కొరకు హైదరాబాద్ తరపున సమన్వయ కర్తగా చేసియున్న అనుభవం 

కవితా ప్రస్థానం :
చిన్నతనం నుంచే నాకు కధలు ,కవితలు ,పాటలు పై మక్కువ ఎక్కువ .
వాటిని ఆచరణలో పెట్టింది మాత్రం ఇంటర్మీడియట్ నుంచి .
నేను కవిగా పరిచయం అయ్యింది మాత్రం మన ఫేస్ బుక్ ద్వారానే . 


  • ''మన తెలుగు మన సంస్కృతి '' మరియు ''సాహితీ సేవ '' మరియు ''కృష్ణా తరంగాలు '' గ్రూప్ లలో జరిగిన కవితా పోటీలలో మరియు 
  • ప్రపంచతెలుగు కవితోత్సవం గిన్నీస్  రికార్డ్  కొన్ని ప్రశంసా పత్రాలను & సత్కారాలను  అందుకోవటం జరిగింది  . అలాగే ''అచ్చంగా తెలుగు ''   , ''మన తెలుగు టైమ్స్ ''  kuwaitnris.com లాంటి కొన్ని అంతర్జాల పత్రికలలో నా కవితలు ప్రచురణ పొందినవి . 

అలానే ''మ్యూజిక్ వరల్డ్ '' ద్వారా నేను రాసిన పాట etv 2 కి సెలక్ట్ అయ్యి ''SHORT FILM '' కి ఉపయోగపడింది . దీని ప్రోత్సాహంతో ఒక పాటను ఆల్బమ్  గా  చేసాను 

నా కవితలు అనుభవాల నుంచి పుట్టేవి .గుండె లోతుల్లో నుంచి మనసు మాట లా అక్షరమై ముందు కొచ్చేవి 


జీవిత లక్ష్యం :

ఒక మంచి కవిగా ,రచయితగా ,వక్తగా పేరు తెచ్చుకోవాలి 
నేను రాసిన కవితలతో కవితా సంపుటిలను ప్రచురించాలి 
(ఇందుకు సంబంధించి మొదటి నా సంపుటి కోసం ప్రయత్నం జరుగుచున్నది )
నేను రాసిన పాటలతో ఒక్క ఆల్బమ్ అన్నా రిలీజ్ చెయ్యాలి 
ఒక్క సినిమాకు అయినా ఒక్క పాట రాసి గేయ రచయిత నవ్వాలి 


నా అభిలాష :

1) కవిగా నేను ఇంకా నేర్చుకుంటూ ముందుకు పోవాలి కొంతమంది పండితుల నుంచైనా 
2) సినీ రచయితగా ఒక్కసారి నా పేరు తెరపై చూసుకోవాలి 
3) నా రాతలను కాగితాలలో బందించి పుస్తకమై చూడాలి 
4) దైవానుగ్రహం ఉంటే ఒక ఆల్భమ్ రూపొందించాలి 

(ఇప్పటికి ఒకటి రూపొందించాను )























Monday, 29 October 2018

ఆదివారం (28. 10. 18) న రాజమహేంద్రవరం లో గోదావరి రచయితల సంఘం (గోరసం ) ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారి శత వర్ధంతి సందర్భంగా  నిర్వహించిన తెలుగు జాతీయ శతాధిక కవి సమ్మేళనం లో కృష్ణా జిల్లా ,మారేడుమాక ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి రాజేంద్ర ప్రసాద్ కు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో  తెలుగు రక్షణ వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కత్తిమండ ప్రతాప్ ,తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షలు శ్రీ కళారత్న పొట్లూరి హరికృష్ణ  మరియు ఇతర ప్రముఖులు చేతులమీదుగా పురస్కారంతో పాటు ఘన సత్కారం చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన గోరంసం సంఘం అధ్యక్షులు శ్రీ సత్య రాజేష్ మరియు వారి కార్య నిర్వాహక వర్గానికి అభినందనలు తెలియచేస్తూ ,తనకు ఇక్కడ రాజమహేంద్రవరం లో ఇది రెండవ పురస్కారం అని హర్షాన్ని వ్యక్త పరిచారు . గతంలో వారికి 2015 లో శ్రీ శ్రీ కళావేదిక తరఫునుంచి ''సాహితీ రత్న '' పురస్కారం రావడాన్ని ఈ సందర్భంగా చేసుకున్నారు

Saturday, 14 July 2018


పేరు : గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
కలం పేరు : గరిమెళ్ళ గమనాలు
స్వస్థలం :  విజయవాడ
ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాద్
వృత్తి : మాదాపూర్ లో ఓ ప్రెవేట్ కంపెనీలో ఉద్యోగం
ప్రవృత్తి : కవితలు మరియు పాటలు
ఇప్పటిదాకా రాసిన కవితలు : సుమారుగా 500
ఇప్పటిదాకా రాసిన పాటలు : సుమారుగా 70
పొందిన బిరుదులు : సాహితీ రత్న , కవి ప్రపూర్ణ , సహస్ర కవి మిత్ర