Monday, 25 May 2015

సాహితీ సేవ సభ్యత్వం :

పేరు : రాజేంద్ర ప్రసాదు 
ఇంటి పేరు : గరిమెళ్ళ 
తండ్రి పేరు : లేట్ సాంబశివరావు 
వృత్తి :  Sr. Executive at Power Mech Projects Ltd 
ప్రవృత్తి : కవితలు ,పాటలు రాయటం 
ఫోన్ నెంబరు : 9705793187
బ్లాగ్ : http://garimellagamanaalu.blogspot.in/
సాహితీసేవలో మీరు సభ్యులుగా కావడానికి మీ ఇష్టాలు?

ఆదరించే విదానం , చిన్నా పెద్దా తేడా లేకుండా అందించే ప్రోత్సాహం 
ఒక కుటుంబంలోని సభ్యులు లా చూపే ఆప్యాయత , మంచి స్నేహ పూర్వక వాతావరణం 

సాహితీసేవలో చురుకుగా ఉన్న మీ పరిచయస్తులు:

1. కంచర్ల సుబ్బానాయిడు గారు 
2. కత్తిమండ ప్రతాప్ గారు 
3. సుకన్య బీగూడెం గారు 
4. పుష్యమి సాగర్ గారు 
5. సిరి వడ్డే  గారు 
6. మంజు యనమదల గారు 

స్వస్థలం :

కేసరపల్లి (ఆంధ్రప్రదేశ్ లోని ,విజయవాడ లో )

చిరునామా :

ప్రగతినగర్ ,హైదరాబాద్ 

''సాహితీ సేవ '' నియమ నిబంధనలకు కట్టుబడి యున్నాను ,ఉంటానని హామీ ఇస్తున్నాను 
తేదీ : 25. 05. 2015

స్థలం : హైదరాబాద్ 

గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు

 

Tuesday, 19 May 2015

మన సాహితీ సేవ వారు నిర్వహిస్తున్న ముఖా ముఖి గురించి చెప్పాలంటే
ఇది ఒక కవుల ,కవయిత్రుల మనోభావాల ,ముఖ పరిచయాల చర్చా కార్యక్రమం
ఇది ఒక భగీరధుని ప్రయత్నం ఎందుకంటే ప్రతి రోజూ ఒక సాహితీ వేత్తను వెతికి పట్టుకుని ,
వారిచే చర్చను నిర్వహిస్తూ ... ఎంతో మంది సాహిత్యంలో ప్రావీణ్యత కల్గి యున్న వారిని అందరికీ పరిచయం చేసి ఎటువంటి వాదోపవాదాలకు తావివ్వకుండా , అందరినీ సమానంగా చూస్తూ ... కవులకు ప్రోత్సాహాన్ని ఇస్తూ
సాగేదే ఈ మన ''ముఖా ముఖి '' కార్యక్రమం

నేను ప్రతి రోజూ మిస్ అవుతూ వస్తున్నాను కాని అందరికీ ఇది స్పూర్తిదాయకం
నాకు ఈ అవకాశం కలిగించినందుకు మన సాహితీ సేవ వారికి మరియు సిరి గారికి నా ప్రత్యెక కృతజ్ఞతలు
మీ అందరి ముందూ చిన్నవాడిని ఏమైనా పొరపాట్లు దొర్లి ఉంటే ఈ ముఖా ముఖి కార్యక్రమం ద్వారా నన్ను మన్నించండి 
భవిష్యత్తులో పుస్తక ప్రచురణ చెయ్యాలని నా మనోసంకల్పం
కాని వాటిని ప్రోత్సహిస్తూ ,నాకు సహకరించే మరి కొన్ని హృదయాలు తోడవ్వాలి

పాతతరం కవిత్వాల గురించి నాకు అంత అవగాహన లేదు కాని
అప్పట్లో వచ్చిన కవితలు గాని , గేయాలు గాని సమాజానికి మేల్కొలిపేలా
మంచి అర్ధవంతంగా , స్పూర్తి నిచ్చేలా , ఉండేవి

కొత్తతరం కవిత్వాలో కూడా అన్నీ బాగుండకపోయినా కొన్ని కొన్ని ఆలోచన రేకెత్తించేలా
హృదయాన్ని హత్తుకునేలా చాలా మంచి సాహితీ వేత్తలు పుట్టుకొస్తున్నారు

కవిత్వం వంట పడితే చాలు అదే మనకు అన్నీ అనే ఫీల్ నాది
కోపమొస్తే మన కసి కవిత్వం
బాధపడితే మన ఊరట కవిత్వం
సలహాలకు స్నేహం కవిత్వం
జీవితానికి అవసరం కవిత్వం
ఇలా చాలా చాలా కవిత్వం మనకు ఊపిరిలా , ఆయుధంలా ,అమ్మ ప్రేమ లా
ప్రేయసి హృదయం లా కనపడుతూ ఉంటుంది షడ్రుచుల సమ్మేళనం కవిత్వం
అంతరంగ తలపుల నాట్య రూపం కవిత్వం





ఒకరికి సూచనలు ఇచ్చేంత ప్రావీణ్యం నాకు లేదు
నా దృష్టిలో కవిత్వం అంటే
మన ఆలోచనలో నుంచి పుట్టేది
నిజాన్ని నేరుగా చూపించేది
మన ఊహలకు ప్రాణం పోసేది
మరొకరికి వినసొంపుగా ఉండేది
ఒకరికి ప్రేరణ ను కలిగించేది
ఒకరి ఆదరణకు నోచుకోగల్గినది
అర్ధవంతంగా , అందంగా అనుభావాత్మకంగా
మన అంతరాలంలో నుంచి వచ్చి
మనసుతో మరో ప్రపంచాన్ని చూపించేది



చాలామంది ఎంతోమంది కవులు ,కవయిత్రులు ముందకు వస్తున్నారు

నేను కవిత్వాన్ని నా జీవితంలో జరిగిన అనుభవాల గుర్తుగా స్టార్ట్ చేసాను
అలా అలా అవి కొన్ని రచనలు అయ్యాయి . దాపరికం లేకుండా చెప్పాలంటే నా జీవితంలో ప్రేమ అంటే సంఘటన
నన్ను ఒక కపిత్వాలు రాసే కవిని చేసింది .ప్రేమ గట్టంపోయి జీవితపు రుచి చూడగానే నా రచనలు క్రమేనా పెరుగుతూ వచ్చాయి


పాట అనుకుని నేను రాసానండి కాని అవి సినీ గేయాలుగా మారితే చాలా తప్పులు ఉండవచ్చు
ఎందుకంటే కవిత్వంలో ఎలానైనా సరే రాయవచ్చు కాని పాట  కు వచ్చే సరికి ఆ ట్యూన్ కి సంబంధించి ,
లైన్స్ ఎన్ని ,సులువుగా తిరిగే పదాల దగ్గరనించి , కొత్త పదాలను అమర్చటం మొత్తం లైన్స్ ఒక ప్రాస లో రావటం చాలా తతంగం ఉంటుంది . నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను సిరిగారు ఇంకా

ఇంకా ఎవరైనా నాతో మాట్లాడాలంటే చెప్పండి

సాహిత్యానికి విలువ పెంచే విషయంలో మన సాహితే సేవ ముందు ముందుకు విజయ క్రమంలో పోతున్నసమూహం మన సాహితీ సేవ నాకు తెలిసి నేను చూసిన గ్రూప్స్ లో మంచి సాహిత్యం కోసం ,మంచి రచనలను ,కవులను ,కవయిత్రులను ప్రోత్సహించి వెన్ను తట్టి వెంట నడిచే గ్రూప్ లో మన సాహితీ సేవ అలాగే మన తెలుగు మన సంసృతి వీరు సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రక్రియ చాలా బాగుంది


కవిత్వం వయస్సు నుంచి పుట్టేది కాదు స్పందించే మనసు నుంచి
కవిత్వానికి కాల పరిమితి ,వయసు పరిమితులు అంటూ ఏమీ ఉండదు .
మన కవిత్వంపై మనకున్న నేర్పు ,కూర్పు ,అనుభూతులే మనకు మంచి అనుభవాన్ని సంపాదించి పెడతాయి
సాహిత్యంపై అభిమానం ఉంటే మంచి సాహిత్యం అదే పుడుతుంది మంచి అనుభావాన్ని కూడా కల్గిస్తుంది
సాహిత్యంలో లీనమవ్వాలి అప్పుడే మంచి సాహిత్యం మధురంగ



అందరికీ నమస్సుమాంజలు
అలాగే సిరిగారు
అయ్యో మీకన్నా చిన్నవాడిని మరీ అన్ని సార్లు నమస్కరించకండి

మా అమ్మ గారి పేరు ''పద్మావతి '' మా నాన్నగారి పేరు ''సాంబశివరావు ''
మాది మధ్యతరగతి రైతు కుంటుంబం . నాన్నగారిని చిన్నతనం నుంచి నేను ఎరుగను అంటే నాకు ఊహ తెలిసే లోపే ఆయన నా నుంచి దూరం అయ్యారు . నాకు అమ్మ అయినా , నాన్న అయినా అన్నీ నాకు అమ్మే ఇప్పటికీ ,ఎప్పటికీ

విద్యార్హతలు :
నాది MBA (finance ) ....ఇప్పుడుకన్నా చిన్నప్పుడు బాగా చదివేవాడిని . అందరికన్నా స్కూల్లో గాని ,కాలేజ్ లో కాని బాగా చురుకుగా ఉండేవాడిని ,చలాకీగా ఉండేవాడిని . ఎప్పుడు అందరికన్నా ముందు ఉండాలనే తాపత్రయం పడుతూ ఉంటాను .

ప్రస్తుతం నేను ఒక ప్రవేట్ కంపెనీ లో '' పవర్ '' కి సంబందించిన వృత్తిలో ఉన్నాను . ఇక నా ప్రవృత్తి అంటా చిన్నప్పటి నుంచి కాస్త నృత్యం , చిత్రలేఖనం వాటిలో ఎక్కువగా శ్రద్ధ ఉండేది ఇప్పుడు కాస్త తగ్గింది . అలానే ఇప్పుడు నాకు ముఖ్యంగా కవితలు ,పాటలు వాటిలో ముందుకు పోతూ ఉన్నాను

నాకు కవిత్వంపై ఉన్న శ్రద్ద ,ఇష్టం చూసి మా ఇంట్లో వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు . అలాగే బయట నా స్నేహితులు కూడా కాలేజ్ రోజుల్లో ,నా పాటలు వింటూ ఉండేవారు . అమ్మ దీవెన ,అమ్మ ప్రోత్సాహం నాకు మెండుగా ఉండేది . ఇప్పుడు మా ఆవిడ కూడా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటది .నేను ఏదన్నా రాసాను అంటే తను ముందుగా చదివి సూచనలు చెప్తూ ఉంటది . మా ఇంట్లో ఇంతకు ముందు తరాలలో ఎవ్వరికీ ఈ కవితలు రాసే అలవాటు లేదని మా వాళ్ళు అంటూ ఉంటారు . అయితే మా పెద్నాన  గారు మాత్రం మా నాయనమ్మ రాసేది అని చెప్తూ ఉంటారు 



మా నాయనమ్మ అప్పటికప్పుడు కాకి ఈక నుంచి అగ్గిపుల్ల దాకా దేనిమీదనైన తను అప్పటికప్పుడు రాసేవారని మా పెద్నాన చెబుతూ ఉంటారు .బహుశా ఆవిడ అలవాటే నాకు అబ్బిందని అంటూ ఉంటారు 

నేను ఎప్పుడూ నేను రాసిన కవితలను పత్రికలకు పంపాలి అని చూడలేదు . కధలు ఎక్కువగా చిన్నప్పుడే ఇప్పుడు నేను కధలు రాయనులేదు . పేస్ బుక్ వచ్చేంతవరకు నాకు కవితలు బద్రపరుచుకోవటం తెలియదు అప్పటిదాకా కాగితాలు , డైరీలు , పుస్తకాలలోనే ఉండేవి . ఆ పై నుంచి సొంతగా బ్లాగ్ చేసుకుని దానిలో రాసుకుంటూ ఉండేవాడిని . ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తుల ప్రోత్సాహంతో ఒకటి రెండు పత్రికలకు కూడా పంపటం జరిగింది . 


డాన్స్ తో నా ప్రతిభను చూపి ర్యాగింగ్ చేసే సీనియర్స దగ్గర impression తెచ్చుకున్నాను .నేను ఎప్పుడూ స్టేజ్ పైకి వెళ్ళినా ప్రైజ్ రావటం మాత్రం పక్కా 

అప్పట్లో నా రచనలు తక్కువే సినిమా పిచ్చి అంటే నటనపై ఆసక్తి ఉండేది . చదువు సంద్యలు ముగిసిన తర్వాత జీవితంలో వచ్చిన బాధ్యతలను నేరవేర్చుకోవటానికి ఆ నటనా పిచ్చి స్వస్థి చెప్పాల్సివచ్చింది 

హా నా బ్లాగ్ నా కలం పేరుతో ఉంటుంది ''గరిమెళ్ళ గమనాలు '' గా . ప్రస్తుతం కాస్త modification లో ఉంది అంతా అయ్యిన తర్వాత నా బ్లాగ్ తప్పక షేర్ చేస్తాను  

నేను ఇప్పటివరకు ఒక 60 పైన పాటలను రాసాను . వాటిలో recent  గా ''మ్యూజిక్ వరల్డ్ '' ద్వారా etv 2 వారు నిర్వహించిన ప్రేమికుల రోజు పాటల పోటీలో నా పాట సెలక్ట్ అయ్యింది అది ప్రోమో సాంగ్ గా కూడా రిలీజ్ అయ్యింది 

అప్పటినుంచి వారు అవకాశం ఇస్తూనే ఉన్నాను నేను సద్వినియోగం చేసుకుంటున్నాను 

అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను సిరి గారు .

అవును సిరిగారు చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు . ఆవిడే కాదు మన సాహితీ సేవ లో నిరాహకులుగా పనిచేస్తున్న వారంతా ఎంతో నేర్పుగా మన సాహితీ సేవను ముందుకు నడిపిస్తున్నారు అందరికీ పేరు పేరున నా హృదయ పూర్వక అభినందలు

నేను స్కూల్ లో చదువుతున్నప్పుడు మొట్టమొదట నేను  ''జన్మభూమి '' కార్యక్రమంపై జనులంతా జనియించిన భూమి మన జన్మభూమి , పాడి పంటలతో విరిసిల్లే భూమి పసిడి భూమి అని అప్పుడు 9 వ తరగతి లో రాసాను దానిపై బహుమతి కూడా అందుకున్నాను మొత్తం అది నాకు గుర్తులేదు దానిని బద్ర పరుచుకోవటం నాకు తెలియలేదు . తర్వాత కాలేజ్ రోజుల్లో ప్రేమపై , స్నేహం పై ఎక్కువగా కవితలు రాసేవాడిని . 5 సం // ల క్రితం అమ్మమ చనిపోయినప్పుడు ఒక కవిత రాసాను  అది బద్ర పరుచుకోలేదు చాలా కాలం వెతికాను కాని అది ఇంట్లో ఎక్కడా దొరకలేదు







Friday, 15 May 2015

నా పేరు రాజేంద్రప్రసాదు ... మా ఇంటి పేరు గరిమెళ్ళ మొత్తం కలిస్తే గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు
ఇంట్లో నా ముద్దు పేరు అంతే పెట్ నేమ్ ''రాజా ''
నా కుటుంబం :
మాది మధ్య తరగతి రైతు కుటుంబం
మా నాన్నగారి పేరు ''సాంబశివరావు '' ఆయన పేరు మట్టికే తెలుసు ఎందుకంటే నాకు ఊహతెలిసేలోపే అయన కాలం చేసారు . ఇక నాన్న అయినా ,అమ్మ అయిన అన్నీ అమ్మే నాకు అమ్మ పొలం పనులకి వెళ్లి నన్ను చదివించింది . మా మేనమామ గారి అధ్వర్యంలో చదువుకున్నాను ,పెరిగి పెద్దవాడినయ్యాను
ఇకపోతే నాకు ఒక అక్క తనకి 10th క్లాస్ అయ్యిన వెంటనే పెళ్ళిచేశారు (అక్క పేరు ఝాన్సి లక్ష్మి ) . మా బావగారు హోటల్ లో చెఫ్ (భావ పేరు : నాగేశ్వర రావు ) .ఇప్పుడు వారు విజయవాడ లోని అగ్రిగోల్ద్ లో executive chef గా పనిచేస్తున్నారు . నాకు ఒక మేనల్లుడు పేరు వినోద్ వాడు ఇప్పడు 2nd inter . అలాగే మేనకోడలు చారు హాసిని తను 8th క్లాస్ . ఇక చివరగా నాలో సగం నా ప్రాణస్వరూపం నా భార్యామణి ''శ్రీ పద్మ '' 24. 08. 2013 లో మా పరిణయమ జరిగినది 

చదువు సంధ్యలు :
మా స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని ,కృష్ణా జిల్లా లో ,గన్నవరం పక్కన ఉన్న ''కేసరపల్లి ''
నేను పుట్టింది కూడా అక్కడే ,పెరిగింది ''మారేడుమాక '' అది అమ్మమ్మ వాళ్ళ ఊరు .
చదువుకుంది ''జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ '' లో 10 వ తరగతి వరకు . చిన్నప్పుడు నేను బాగా చురకుగా ఉండేవాడిని అందరికంటే చదువులో కూడా ముందుండేవాడిని .సృజనాత్మకత దోరణి అప్పటిలో కాస్త ఎక్కువే . 
నాకు నేను నేనే కొన్ని కధలు పుట్టించుకుని ,అందరికీ అవే చెప్తూ ఉండేవాడిని . వ్యాస రచనలు , డిబేట్ లలో చాల చలాకీగా పాల్గునేవాడిని . నేను తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు అనుకుంట ''జన్మభూమి ''గురించి డిబేట్ చేసినప్పుడు సొంతంగా ఒక కవిత లా చెప్పాను దానికి మా హెడ్ ప్రిన్స్ పల్  సార నాకు భాహుమతిని కూడా ఇచ్చారు . దేవుళ్ళపై పాటలు రాసి పాడుకునేవాడిని . నేను రాసిన పాటలు నా స్నేహితుల అమ్మమ్మ వాళ్ళు తీసుకుని అదే కీర్తనలు లా పాడుకునేవాళ్ళు .నాకు చిన్నప్పటి నుంచి దైవ భక్తి  ఎక్కువ . 
ఆ తర్వాత ''రాకాసి పాము '' మరియు ''ఎగ్జిభిషన్ '' అనే కధలు సొంతంగా రాసి క్లాస్ లో కధలు చెప్పమంటే ఇవే చెప్పేవాడిని . ఆ నాటి రోజులే వేరు ఒక మతపరంగా గాని ,కులప్రకారంగా గాని ఎటువంటి వివక్షలు లేవు .నాకు అవి తెలియనే తెలియవు అరేయ్ అని పిలుచుకున్న రోజులు కూడా లేవు . 5 వ తరగతి వరకు ఫైనల్ పరీక్షలలో అన్ని రోజులవి కలిపి ఒకేసారి రాసి తిరుపతి వెళ్ళేవాడిని . ఫస్ట్ క్లాస్ నా (లేదా ) సెకండ్ క్లాస్ నా అనే డౌట్ కూడా వచ్చేది కాదు . కచ్చితంగా నేను స్కూల్ ఫస్ట్ ... 
చిన్నప్పుడు ఆకులు అలములతో ,రాళ్ళు ,ఇనుపముక్కలు ,మట్టి ఇలా కొన్ని కొన్ని వస్తువులతో ఏవో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తూ ఉండేవాడిని . నా పదవ తరగతి తర్వాత ఏమి చెయ్యాలో నా మీదనే వదిలేసారు నాకు చదువుపై ఉన్న అవగాహనకి . అలా అలా ఇంటర్ లోకి వెళ్లి పడ్డా గన్నవరం లో అక్కడి నుంచి అల్లరి పెరిగి ... కాగితాలు నలిగి కలం విసిగి పిచ్చి పిచ్చి రాతలు రాయటం మొదలయ్యింది అప్పటి నుంచి ఇప్పటి దాకా రాస్తూనే ఉన్నాను అయితే అప్పట్లో అవి కేవలం పుస్తకాలలో , నా డైరీ లలో మాత్రమే ఉండేవి . పేస్ బుక్ పరిచయం అయ్యిన తర్వాత బ్లాగ్ గా మారి నా పేరు ''గరిమెళ్ళ గమనాలు '' గా మారింది 

అయితే కాలేజ్ రోజుల్లో చదువుకన్నా నా రచనలతో పాటు ఇతరత్రా వ్యాపకాలు కూడా ఎక్కువయినాయి . వాటిలో ముఖ్యంగా డాన్స్ ,చిత్ర లేఖనం ,సినిమాల పిచ్చి   మొ// నవి . డాన్స్ లో నాకు నేను నిరూపించుకున్న రోజులు లేఖపోలేదు .నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాపై సీనియర్స్ ర్యాగింగ్ చెయ్యగా నా డాన్స్ నన్ను వాళ్ళు నా దగ్గరికి రాకుండా ,నన్నేమి అనకుండా చేసింది . ఒకటి ,రెండు బహుమతులు కూడా వచ్చాయి . ఇక చదువు అంతా అయ్యిపోయిన తర్వాతా కుటుంబ భాద్యతలు తెలుసుకుని నా సినిమాల పిచ్చిని పక్కకు పెట్టి ఉద్యోగం చెయ్యటం ప్రారంభించాను 2005 నుంచి . అమ్మకు తోడుగా ఉంటూ నా జీవితాన్ని ప్రారంభించాను . దేవుడు అంటే చూడలేదు కాని దేవతని మాత్రం అమ్మలో చూసుకున్నాను . నాకున్న ఒకే ఒక్క దైవం అమ్మే అని తెలుసుకున్నాను .ఇలా నాకు ఒక్కడికే కాదులెండి అమ్మంటే అపురూపమే అందరికీ ,అమ్మప్రేమ అమృతమే అందరికీ నాటికి ... నేటికి అమ్మ ప్రేమ , అమ్మ దీవెనే నాకు ఆశీర్వాదం ,అనుగ్రహం అని నమ్ముతున్నాను . 


సోషల్ సర్వీస్ :
కాలేజ్ డేస్ నుంచి అవసరమైనప్పుడు బ్లడ్ ఇస్తూ ఉండేవాడిని .  ఆ టైం లో కొన్ని సర్టిఫికేట్ లను కూడా పొందాను . 
పెళ్లి ముందు వరకు చాలా మందికి బ్లడ్ హెల్ప్ చేస్తూ వచ్చే వాడిని . కొన్ని గ్రూప్స్ లలో కీలక పాత్ర కూడా పోషించాను క్రమేణ బిజీ లైఫ్ స్టార్ట్ అయ్యి , వాటికి దూరం అవుతూ వచ్చాను ''తలసీమియా '' కోసం  బ్లడ్ క్యాంప్స్ కూడా నిర్వహించాను .ఇప్పటికీ ''తలసీమియా '' కోసం  బ్లడ్ క్యాంప్స్  నిర్వహిస్తూనే ఉన్నాను . నా నోటీస్ కి ఏదైనా బ్లడ్ నీడ్స్ వస్తే అది ఫుల్ ఫిల్ చేసే వరకు వదిలిపెట్టను . 
నేను  పని చేస్తున్న సంస్థ ద్వారా ''స్వచ్చ్ భారత్ ''  కార్యక్రమం కోసం  తెలంగాణ & ఆంద్ర ప్రదేశ్ లో రెండు సార్లు  స్వచ్చంధంగా పాల్గొన్నాను 
 పంచ భూతాలు మనిషి జీవించటానికి ఎంత అవసరమో , 


నా సాహిత్య ప్రయాణం :

కొంతమంది సాహిత్య ప్రావీణ్యం ఉన్న కవి ,కవయిత్రుల వలన నా రచనలు కాస్త ప్రోత్సాహం లభించి ,నా కలం ముందుకు వెళ్ళటం మొదలయ్యింది .
1) నేను రాసిన ''సంక్రాంతి '' & కవితా కారం  ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురణ అయ్యినవి 
2) అలానే పేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యిన ''మన తెలుగు మన సంస్కృతి '' వారు నిర్వహించే చిత్ర కవితా పోటీ లలో ఎన్నో సార్లు ''ప్రశంసా పత్రాలను ''  అందుకోవటం జరిగింది 
3) అలానే మన సాహితీ సేవ వారు నిర్వహించిన చిత్ర కవితా పోటీ లలో 3 ప్రశంసా పత్రాలను , జ్ఞ్నాపికలను తొలి సారి అంతర్వేది నరసింహ స్వామి సాక్షిగా , ప్రత్యక్షంగా అందుకోవటం జరిగింది . ఎంతో మంచి ఆత్మీయ విలువలు కల సాహితీ కుటుంబాన్ని పరిచయం చేసింది 
4) అదే అంతర్వేది లో గిన్నీస్ రికార్డ్ నెలకొల్పిన ''ప్రపంచ తెలుగు కవితోత్సవం '' లో ''ప్రశంసా పత్రాలు ,సర్టిఫికెట్స్ ''  తో పాటు సత్కారం పొందటం జరిగింది 

5) అలానే ''మ్యూసిక్ వరల్డ్ '' ద్వారా నేను రాసిన పాట ''ప్రేమికుల రోజు '' సందర్భంగా ఈ టీవీ 2 కి సెలక్ట్ అయ్యి ఒక షార్ట్ ఫిలిం కి ప్రోమో సాంగ్ గా మారింది ఇది నేను తొలి సారి నాకు నేను చూసుకున్న లిరిసిస్ట్ అను ముద్ర 
ఆ పిమ్మట రెండు ,మూడు సార్లు వాళ్ళు పిలిచి అవకాశం ఇచ్చారు .. దానిని నేను సద్వినియోగం చేసుకున్నా కాని షార్ట్ ఫిల్మ్ వాయిదా పడింది . ఇదే ప్రోత్సాహంతో నేను సొంతంగా ఒక పాటతో కూడిన ఆల్బమ్  చేయటం జరిగింది 

5 ) అలానే ''మలేషియా తెలుగు కవితలు '' & ''కృష్ణా తరంగాలు '' గ్రోప్ లలో కొన్ని సార్లు విజేత గా నిలవటం 
6) ''అచ్చంగా తెలుగు '' & ''మన తెలుగు టైమ్స్ '' అంతర్జాల పత్రికలలో ప్రచురితమైన నా కవితలు 
    స్త్రీ ఆవేదన మరియు నీలా ఎవరు (అమ్మ పై )

అందరితో పోల్చి చూసుకుంటే నేను సాదించింది ఏమీ లేదు వీటిని నేను గొప్పగా నేనేమి చెప్పుకోవడానికి కాదు 
చిన్న చిన్న మైలు రాళ్ళు నీ సాహితీ ప్రయాణంలో చిరు జ్ఞాపికలు ఇప్పటివరకే . కవి అనువాడు అస్సలు నేను కవినే కాదు అనుకుంటూ ముందుకు పోతూ ఉంటేనే ఇంకా కొన్ని మంచి రచనలు చేయగలడు . నా బుర్రలో గుజ్జు నజ్జై నా కలం కక్కితే పుట్టిన రాతలే కవితలు అనే భావాలు మాత్రమే 

నా అభిలాష :

1) కవిగా నేను ఇంకా నేర్చుకుంటూ ముందుకు పోవాలి కొంతమంది పండితుల నుంచైనా 
2) సినీ రచయితగా ఒక్కసారి నా పేరు తెరపై చూసుకోవాలి 
3) నా రాతలను కాగితాలలో బందించి పుస్తకమై చూడాలి 
4) దైవానుగ్రహం ఉంటే ఒక ఆల్భమ్ రూపొందించాలి