Thursday, 5 November 2015

నా గురించి క్లుప్తంగా:-


వ్యక్తిగత పరిచయం :

నా పేరు గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు . నా కలం పేరు ''గరిమెళ్ళ గమనాలు '' ఇదే పేరుతో నాకు పేస్ బుక్ ఐ . డి ఉంది . మా స్వస్థలం ఆంద్ర ప్రదేశ్ లోని విజయవాడ పక్కన ''కేసర పల్లి '' . అమ్మ పేరు పద్మావతి .నాన్న పేరు కీ //శే // సాంబశివరావు . నా చిన్నతనం నుంచి ఆయన జ్ఞాపకాలు ఎరుగను . అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను  
మేనమామ ఆధ్వర్యంలో చదువుకున్నాను . నాకు ఒక అక్క ,పేరు :ఝాన్సీ లక్ష్మి ,భావగారు నాగేశ్వరరావు కార్పోరేట్ చెఫ్ గా పని చేస్తున్నారు .నా శ్రీమతి ''శ్రీ పద్మ ''. 
ఇకపోతే నేను హైదరాబాద్ లో ప్రేవేట్ కంపెనీలో పని చేస్తున్నాను . 

కవితా ప్రస్థానం :

చిన్నతనం నుంచే నాకు కధలు ,కవితలు ,పాటలు పై మక్కువ ఎక్కువ .
వాటిని ఆచరణలో పెట్టింది మాత్రం ఇంటర్మీడియట్ నుంచి .
నేను కవిగా పరిచయం అయ్యింది మాత్రం మన ఫేస్ బుక్ ద్వారానే . 


  • ''మన తెలుగు మన సంస్కృతి '' మరియు ''సాహితీ సేవ '' మరియు ''కృష్ణా తరంగాలు '' గ్రూప్ లలో జరిగిన కవితా పోటీలలో మరియు 
  • ప్రపంచతెలుగు కవితోత్సవం గిన్నీస్  రికార్డ్  కొన్ని ప్రశంసా పత్రాలను & సత్కారాలను  అందుకోవటం జరిగింది  . అలాగే ''అచ్చంగా తెలుగు ''   , ''మన తెలుగు టైమ్స్ ''  kuwaitnris.com లాంటి కొన్ని అంతర్జాల పత్రికలలో నా కవితలు ప్రచురణ పొందినవి . 
  • మొన్న అక్టోబర్ -2016 లో రాజమహేంద్రవరంలో శ్రీ శ్రీ కళావేదిక తరపున నుంచి శ్రీ శ్రీ పురస్కారం పేరిట ''సాహితీ రత్న '' ప్రతిభా అవార్డు ను పొందటం జరిగింది 

రెండు సార్లు నేను రాసిన రెండు   కవితలు ''ఆంధ్రజ్యోతి '' పత్రికలో  లో రావటం జరిగింది 
అలానే ''మ్యూజిక్ వరల్డ్ '' ద్వారా నేను రాసిన పాట etv 2 కి సెలక్ట్ అయ్యి ''SHORT FILM '' కి ఉపయోగపడింది . దీని ప్రోత్సాహంతో ఒక పాటను ఆల్బమ్  గా  చేసాను 

నా కవితలు అనుభవాల నుంచి పుట్టేవి .గుండె లోతుల్లో నుంచి మనసు మాట లా అక్షరమై ముందు కొచ్చేవి 

జీవిత లక్ష్యం :

ఒక మంచి కవిగా ,రచయితగా ,వక్తగా పేరు తెచ్చుకోవాలి 
నేను రాసిన కవితలతో కవితా సంపుటిలను ప్రచురించాలి 
(ఇందుకు సంబంధించి మొదటి నా సంపుటి కోసం ప్రయత్నం జరుగుచున్నది )
నేను రాసిన పాటలతో ఒక్క ఆల్బమ్ అన్నా రిలీజ్ చెయ్యాలి 
ఒక్క సినిమాకు అయినా ఒక్క పాట రాసి గేయ రచయిత నవ్వాలి 





No comments:

Post a Comment